కరోనాతో అల్లకల్లోలమవుతున్న బ్రిటన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (55) కరోనా వ్యాధి బారిన పడ్డారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.
ప్రస్తుతం ఆయన హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూనే, ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేసారు. ‘‘గత 24 గంటలుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నేను స్వంత ఐసొలేషన్‌లో ఉన్నాను. అయినప్పటికీ, ప్రభుత్వ బాధ్యతలను విడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహిస్తూ, కరోనాతో పోరాడతాను’’ అని జాన్సన్ తెలిపారు.
ప్రస్తుతం యూకేలో 9533 పాజిటివ్ కేసులుండగా, 463మంది మరణించారు.
Over the last 24 hours I have developed mild symptoms and tested positive for coronavirus.
I am now self-isolating, but I will continue to lead the government’s response via video-conference as we fight this virus.
Together we will beat this. #StayHomeSaveLives pic.twitter.com/9Te6aFP0Ri
— Boris Johnson #StayHomeSaveLives (@BorisJohnson) March 27, 2020