మరొక ప్యాకేజీ తో రానున్న నిర్మల? ఈ సారి వాళ్ళకి బంపర్ ఆఫర్..!!

-

కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులు కావటం తో ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2019 ఆదాయపు పన్ను జిఎస్టి పన్ను జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు గతంలో ప్రకటించడం జరిగింది. అయితే దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా మంది పేదలు మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారడంతో వారిని ఆదుకోవడం కోసం లక్షా 70 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ తీసుకు రావడం జరిగింది.Nirmala Sitharaman Releases Postage Stamp To Commemorate ...దేశంలో ఆహార అవసరాలు తీర్చడానికి ముఖ్యంగా గ్రామీణ పేదలను ఆదుకోవడానికి ఈ ప్యాకేజీ తీసుకువచ్చినట్లు నిర్మల సీతారామన్ చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగా శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా కల్పించడం జరిగింది. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున బీమా కల్పించారు. కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు.” తీసుకుంటున్నట్లు నిర్మల సీతారామన్ చెప్పుకొచ్చారు. వలస కార్మికులు మరియు మహిళలు పేదలకు మేలు చేసేలా ప్రత్యక్ష నగదు బదిలీ నేరుగా లబ్ధిదారులకు ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 

అంతేకాకుండా రానున్న మూడు నెలలకు ఒక్కరికి నెలకు ఐదు కేజీల బియ్యం, గోధుమ వీటిలో ఏది కావాలంటే అది, దానితోపాటు ప్రతి కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఉన్న కొద్ది వైరస్ ప్రభావం ఎక్కువ అవుతున్న తరుణంలో చేతి వృత్తుల వారికి .. కూరగాయల వారికి .. ఈ టైమ్ లో ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసులకి కొత్త బంపర్ ఆఫర్ తో మరొక ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడానికి రెడీ అవుతున్నట్లు జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news