కరోనాకు సముద్రపు నాచుతో మందు…!

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పుడు మందు కనుక్కోవడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా మందు కనుక్కోవడానికి గానూ చాలా జాగ్రత్తగా ప్రయోగాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు మందు తయారికి భారీగా నిధులను కేటాయిస్తున్నాయి. మన దేశంలో కూడా కరోనా వైరస్ కి మందు కనుక్కోవడానికి విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి.

తాజాగా రిలయన్స్ కూడా మందు కనుక్కొనే పనిలో భాగంగా కీలక అడుగు వేసింది. సముద్రాల్లో ఉండే ఓ రకమైన ఎరుపు నాచుకు కరోనా ఇన్ఫెక్షన్లను నిరోధించే శక్తి ఉందని రిలయన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు తాజాగా తమ పరిశోధనల్లో గుర్తించారు. పొర్ఫీరీడియం సల్ఫేటెడ్‌ రకపు ఎరుపు నాచు నుంచి ఎక్కువగా ఉత్పత్తి అయ్యే పాలీ శాకరైడ్‌లు కరోనా కట్టడికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

తీవ్ర శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే కరోనాకు చెందిన సార్స్, మెర్స్, కోవిడ్ 19 వైరస్ లను అడ్డుకుని వాటి మీద ఇవి బలమైన యాంటీ వైరల్‌ ఏజెంట్లుగా పనిచేస్తాయని తమ పరిశోధనల్లో గుర్తించారు. ఈ మేరకు ఒక అధ్యయన పత్రాన్ని కూడా వారు విడుదల చేసారు. యాంటీ వైరల్‌ ఔషధాలు తయారు చేయవచ్చని అంతే కాకుండా శానిటరీ ఉపకరణాలపై వైరస్‌ దుర్భేద్యమైన కోటింగ్‌ వేసే అవకాశం ఉంటుందని తమ పత్రంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version