భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత 24గంటల్లోనే ఏకంగా 61,749 కేసులు నమోదు కాగా 846 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 31,05,185కు చేరుకుంది. ఇక మరణాల సంఖ్య 57,691కు చేరుకుంది. అయితే.. ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
మహారాష్ట్ర(682,383), తమిళనాడు (379,000), ఆంధ్రప్రదేశ్ (345,216), కర్నాటక (277,814), ఉత్తరప్రదేశ్(182,453) అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే.. బిహార్‌లో కూడా ఈ మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య 122,000కు చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య 161,466కు చేరుకుంది. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 23,577,626మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. 16,027,151మంది కోలుకున్నారు. 810,879మంది మరణించారు. ప్రధానంగా అమెరికాలో 5,856,346 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత బ్రెజిల్‌లో 3,589,469కేసులు నమోదు అయ్యాయి.