తెల్ల బంగారం రైతులకు సిరులు కురిపిస్తోంది. పత్తి ధరలు రికార్డు ధరలు పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తమవుతోంది. క్వింటాల్ పత్తి ధర రూ. 8 వేలకు పైగానే పలుకుతోంది. నిన్న వరంగల్ మార్కెట్ లో క్వింటాల్ పత్తి ధర రూ. 8230 చేరింది. ఈధర గతలో ఎప్పుడూ లేదని, క్వింటాల్ కు నాలుగైదు వేలు ఎప్పడూ మించలేదని రైతులు అంటున్నారు. ఈ సారి సాగు విస్తీర్ణం తగ్గడంతో మార్కెట్ కు తక్కువగా వస్తోంది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ ఏర్పడింది. దీంతో రికార్డ్ స్థాయిలో ధర లభిస్తోందని వ్యాపారులు అంటున్నారు. మూడేళ్లుగా పత్తి బఫర్ స్టాక్ తగ్గడంతో పాటు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో పత్తి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఇంటర్నేషనల్ గా మన దేశపు పత్తికి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. గతంలో కోవిడ్ కారణంగా టెక్స్ టైల్స్ పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఇవన్నీ క్రమక్రమంగా తెరుచుకుంటున్నాయి. దీంతో ముడిసరుకైన పత్తికి భారీగా డిమాండ్ ఏర్పడింది. బంగ్లాదేశ్, చైనా, యూరోపియన్, అమెరికా మార్కెట్ లో పత్తి అవసరాలు పెరిగాయి. మనదేశం నుంచి పత్తి ఎగుమతి అవుతుండటంతో డిమాండ్ పెరిగింది.