Breaking : జగన్‌కు షాక్‌ ఇచ్చిన సీబీఐ.. పారిస్‌ టూర్‌కు పర్మిషన్‌ నో..!

-

సీఎం జగన్‌కు సీబీఐ షాక్‌ ఇచ్చింది. సీఎం వైఎస్ జగన్‌ మ‌రోమారు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న జ‌గ‌న్ తాజా విదేశీ ప‌ర్య‌ట‌నకు అనుమ‌తి ఇవ్వాలంటూ నాంప‌ల్లిలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై సోమ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో సీబీఐ.. జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్తే… ఆయ‌న‌పై న‌మోదైన కేసుల విచార‌ణ‌లో జాప్యం చోటుచేసుకుంటుంద‌ని వాదిస్తూ అనుమతులు ఇవ్వద్దంటూ వాదించింది.

అంతేకాకుండా ప‌లు కార‌ణాలు చెబుతూ జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళుతున్నార‌ని,ఈ కార‌ణంగా జ‌గ‌న్‌ను విదేశీ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తించ‌రాదంటూ సీబీఐ కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. జ‌గ‌న్ కుమార్తెల్లో ఒక‌రు పారిస్‌లో విద్య‌న‌భ్య‌సిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ఆమె విద్యాభ్యాసం ముగియ‌గా… ఆమె క‌ళాశాల‌కు సంబంధించిన స్నాత‌కోత్స‌వం త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంద‌ట‌. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకే తాను పారిస్ వెళ్లాల్సి ఉంద‌ని చెప్పిన జ‌గ‌న్‌… అందుకు అనుమ‌తించాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై సోమ‌వారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా సీబీఐ కౌంట‌ర్ దాఖ‌ల చేయ‌గా… త‌దుప‌రి విచార‌ణ‌లో కోర్టు త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version