సమగ్రమైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వగలుతామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఇందులో సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని, అందుకే జీతాలు పెంచామని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలకే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది జీతాన్ని 50శాతం పెంచిందని, రూ.12 వేల నుంచి రూ.18వేలకు పెంచిందన్నారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో వారిని ఎవ్వరూ పట్టించుకో లేదన్న సీఎం జగన్.. వారు చేస్తున్న పనులను చూసి, చలించి వారికి రూ.18వేల జీతాన్ని అధికారంలోకి రాగానే ఇచ్చామన్నారు.
ప్రజారోగ్యం కోసం వారు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, ఈ పనులను ఎవ్వరూ కూడా చేయలేరన్నారు సీఎం జగన్. 2015 నుంచి 2018 సెప్టెంబరు వరకూ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది జీతం కేవలం రూ.10 వేలు మాత్రమేనని, 2019 ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు వారి జీతం రూ.10 వేల నుంచి రూ.12వేలు చేశారని, ఐదేళ్లపాటు చంద్రబాబు నెలకు ఇచ్చింది కేవలం రూ.10వేలు మాత్రమేనని ఆయన మండిపడ్డారు. మనం వచ్చిన తర్వాత రూ.18 వేలు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.