కొడంగల్‌లో కొత్త ‘ట్విస్ట్’లు..రేవంత్ ప్లాన్ ఏంటి?

-

రేవంత్ రెడ్డి అడ్డాగా ఉన్న కొడంగల్ లో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి…అసలు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేస్తారా? లేదా? అనే అంశంపై ఎక్కువ చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఈ సారి కొడంగల్ నుంచి పోటీ చేయరని, ఈ సారి ఆయన గ్రేటర్ పరిధిలోని ఎల్బీనగర్ లేదా ఉప్పల్ లో పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు కొట్టి పారేస్తున్నాయి…మళ్ళీ రేవంత్ కొడంగల్ లోని పోటీ చేసి సత్తా చాటుతారని, ఓడిన చోటే గెలిచి చూపిస్తారని అంటున్నాయి. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళిన విషయం తెలిసిందే…ఇదే క్రమంలో 2018 ఎన్నికల్లో రేవంత్ మరొకసారి కొడంగల్ లో పోటీ చేసి…అనుహ్యాంగా ఓటమి పాలయ్యారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం…మళ్ళీ కొడంగల్ లోనే పోటీ చేసే ఛాన్స్ ఉంది…కానీ ఆయన కొడంగల్ వదిలేసి…ఎల్బీనగర్ బరిలో ఉంటారని అంటున్నారు. ఇక కొడంగల్ సీటు తన సోదరుడు తిరుపతిరెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇలా రేవంత్ సీటు విషయంలో ట్విస్ట్ నడుస్తుండగానే, కొడంగల్ లో మరొక ట్విస్ట్ వచ్చింది…కొడంగల్లో సీనియర్ నేత గురనాథ్ రెడ్డి…షర్మిల పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. గతంలో గురునాథ్…కొడంగల్ బరిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

అలాగే రేవంత్ చేతిలో రెండుసార్లు ఓడిపోయారు..ఇక రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చాక…గురునాథ్ టీఆర్ఎస్ లో చేరారు. కానీ టీఆర్ఎస్ లో ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయింది. దీంతో ఆయన తాజాగా విజయమ్మతో భేటీ అయ్యి వైఎస్సార్టీపీలో చేరే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన వైఎస్సార్టీపీ నుంచి కొడంగల్ లో పోటీ చేయొచ్చని తెలుస్తోంది. గురునాథ్ బరిలో దిగితే కొడంగల్ పోరు మరింత రసవత్తరంగా మారే ఛాన్స్ ఉంది. మరి ఇలాంటి తరుణంలో రేవంత్…కొడంగల్ బరిలో దిగుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version