ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు ఆదేశాలు !

మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు కరీంనగర్ జిల్లా కోర్టు. హిందూ దేవతలను కించ పరిచేలా….ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేసారంటూ  న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో న్యాయవాది మహేందర్ రెడ్డి కరీంనగర్ కోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన ప్రిన్సిపాల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సాయి సుధ… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా త్రీటౌన్ పోలీసులను ఆదేశించారు. ఇది ఇలా ఉండగా ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు. ఐపీఎస్‌ పదవికి ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాలంటరీ రిటైర్మెంట్‌ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.