కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (10-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో గురు‌‌వారం (10-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 10th september 2020

1. యుక్త వ‌య‌స్సులో ఉండి, స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న వారికి క‌రోనా వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు తేల్చారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ బారిన ప‌డ్డ పేషెంట్ల‌కు చెందిన వివ‌రాల‌ను అధ్య‌య‌నం చేసిన అనంత‌రం వారు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

2. ఏపీలో కొత్త‌గా 10,175 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,37,687కు చేరుకుంది. 97,338 మంది చికిత్స పొందుతున్నారు. 4,35,647 మంది కోలుకున్నారు. 4,702 మంది చ‌నిపోయారు.

3. ఏపీలో నిర్వహించిన సీరో సర్వైలెన్స్‌ సర్వే ఫలితాల‌లో రాష్ట్రంలో 19.7 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని నిర్ధారణ అయింది. పురుషుల్లో 19.5 శాతం మందికి కరోనా వచ్చిపోయింద‌ని, మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చిపోయింద‌ని నిర్దారించారు.

4. బ్రిట‌న్‌లో ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను ఆపేసినా సీరం ఇనిస్టిట్యూట్ ట్ర‌య‌ల్స్ ను ఇంకా ఎందుకు కొన‌సాగిస్తుంద‌ని ప్ర‌శ్నిస్తూ డీసీజీఐ ఆ సంస్థ‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. త్వ‌ర‌లో ఆ నోటీసుల‌కు సీరం ఇనిస్టిట్యూట్ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

5. దేశంలో కొత్త‌గా 95,735 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 44,65,864కు చేరుకుంది. 9,19,018 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 34,71,784 మంది కోలుకున్నారు. 75,062 మంది చ‌నిపోయారు.

6. తెలంగాణలో కొత్త‌గా 2,534 క‌రోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,50,176 కు చేరుకుంది. 927 మంది చ‌నిపోయారు. 1,17,143 మంది కోలుకున్నారు. 32,106 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

7. ఢిల్లీలో కొత్త‌గా 4,308 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,75,400కు చేరుకుంది. 4,666 మంది చ‌నిపోయారు. 25,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

8. క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా 9,217 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,30,947కు చేరుకుంది. 6,937 మంది చ‌నిపోయారు. 3.22 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు.

9. తమిళనాడులో కొత్త‌గా 5,528 క‌రోనా‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,86,482 కు చేరుకుంది. 8,154 మంది చ‌నిపోయారు. 4,29,416 మంది కోలుకున్నారు.

10. క‌రోనా ప‌ట్ల ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌ధాని మోదీ సూచించారు. ప్ర‌జ‌లు మాస్క్‌ల‌ను ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని అన్నారు. క‌రోనాను అంత తేలిగ్గా తీసుకోరాద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news