కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (15-07-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో బుధ‌‌‌వారం (15-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid-19 top 10 updates on 15th july 2020

1. కర్ణాటక ప్ర‌భుత్వం ప్లాస్మా దానంపై కీలక ప్రకటన చేసింది. ప్లాస్మా దాతలను ప్రోత్సహించడానికి గాను ప్లాస్మా దానం చేసిన వారికి రూ.5 వేల బహుమతి ఇస్తామని చెప్పింది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ ప్ర‌క‌టించారు. దేశంలో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో కోవిడ్ ఎమ‌ర్జెన్సీ పేషెంట్ల కోసం ప్లాస్మా బ్యాంకుల‌ను ఓపెన్ చేస్తున్న విష‌యం విదిత‌మే.

2. కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ కేవ‌లం రూ.650కే కోరోసూర్ పేరిట క‌రోనా టెస్టు కిట్‌ను విడుద‌ల చేశారు. దీన్ని ఢిల్లీ ఐఐటీ బృందం త‌యారు చేసింది. న్యూటెక్ మెడిక‌ల్ కంపెనీ ఈ టెస్టు కిట్‌ను మార్కెట్‌లో విక్ర‌యిస్తోంది. దీని ద్వారా క‌రోనా ప‌రీక్ష‌ల‌ను చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే చేయ‌వ‌చ్చు.

3. హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ), అజిత్రోమైసిన్ అనే రెండు మెడిసిన్ల వ‌ల్ల అధిక‌ శాతం మందిలో క‌రోనా న‌య‌మ‌వుతుంద‌ని కేర‌ళ‌ సైంటిస్టులు వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆ రాష్ట్ర మెడిక‌ల్ బోర్డు చేప‌ట్టిన క్లినిక‌ల్ స్ట‌డీ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. స‌ద‌రు రెండు మెడిసిన్ల వ‌ల్ల క‌రోనా పేషెంట్లు ఎమ‌ర్జెన్సీ ద‌శ‌కు చేరకుండానే వేగంగా కోలుకుంటున్నార‌ని తెలిపారు.

4. యాంటీ కొలెస్ట్రాల్ డ్ర‌గ్ అయిన ఫెనోఫైబ్రేట్ కోవిడ్ ప్ర‌భావాన్ని చాలా వ‌ర‌కు త‌గ్గిస్తుంద‌ని తేల్చారు. ఈ మేర‌కు హెబ్రూ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఫెనోఫైబ్రేట్ మెడిసిన్‌ను హై కొలెస్ట్రాల్ ఉన్న‌వారికి, గుండె జ‌బ్బుల బారిన ప‌డ్డ‌వారికి, ప‌లువురు డ‌యాబెటిస్ పేషెంట్ల‌కు ఇప్ప‌టికే ఇస్తున్నారు.

5. దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 29,429 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,36,181కి చేరుకుంది. ఒక్క రోజులోనే 582 మంది చ‌నిపోయారు. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 24,309కి చేరుకుంది. మొత్తం 3,19,840 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 5,92,031 మంది కోలుకున్నారు.

6. క‌రోనా కార‌ణంగా చైనాతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేన‌ని ట్రంప్ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడే ఆలోచ‌న లేద‌న్నారు. రెండో ద‌శ వాణిజ్య ఒప్పందం కోసం చైనాతో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం త‌మ‌కు ఇష్టం లేద‌ని ట్రంప్ తెలిపారు.

7. అమెరికా కూడా క‌రోనా వ్యాక్సిన్‌కు గాను తొలి ద‌శ క్లినికల్ ట్ర‌య‌ల్స్‌ను పూర్తి చేసింది. జూలై చివ‌రి నాటికి మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ ప్రారంభిస్తామ‌ని తెలిపింది. అక్క‌డి మోడెర్నా అనే కంపెనీ ఆ వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌గా.. దాన్ని తీసుకున్న వాలంటీర్ల‌లో చాలా త‌క్కువ సైడ్ ఎఫెక్ట్స్ క‌నిపించాయి. మూడో ద‌శ‌లో అనుమ‌తి ల‌భిస్తే.. ఏడాది చివ‌రి వ‌ర‌కు 500 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్‌ను ముందుగా సిద్ధం చేస్తారు.

8. మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే 7,975 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,75,640కు చేరుకుంది. అలాగే 1,11,801 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,52,613 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

9. కోవిడ్‌పై పోరులో విధులు నిర్వ‌హించేందుకు గాను బెంగ‌ళూరు పోలీసులు వినూత్న ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టారు. 18 నుంచి 45 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారు ఎవ‌రైనా ఆరోగ్య‌వంతులు అయితే చాలు.. అక్క‌డ సివిల్ పోలీస్ వార్డెన్‌గా విధులు నిర్వ‌హించ‌వ‌చ్చు. ఇందుకు http://bcp.gov.in అనే వెబ్‌సైట్‌లో వారు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాలి.

10. క‌రోనా నేప‌థ్యంలో ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు ఎయిరిండియా ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చింది. త‌మ సంస్థ‌లో ఎంపిక చేసిన ఉద్యోగుల‌ను 6 నెల‌ల నుంచి 5 ఏళ్ల వ‌ర‌కు వేత‌నం లేని సెల‌వుపై పంపించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఎయిరిండియా ఇందుకు గాను స్వ‌యంగా ఆయా ఉద్యోగుల‌ను ఎంపిక చేయ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news