కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో ఆదివారం (16-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. దేశంలో కొత్తగా 63,489 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 25,89,682కు చేరుకుంది. 6,77,444 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 18,62,258 మంది కోలుకున్నారు. 49,980 మంది చనిపోయారు.
2. తెలంగాణలో కొత్తగా 1102 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 91,361కు చేరుకుంది. 693 మంది చనిపోయారు. 22,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 68,126 మంది కోలుకున్నారు.
3. కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లను ఏర్పాటు చేస్తారు. అలాగే సభలో 4 స్క్రీన్లు, 4 గ్యాలరీల్లో మరో 6 చిన్న స్క్రీన్లను, ఆడియో సిస్టమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
4. గుండె జబ్బులు ఉన్నవారు కరోనా బారిన పడితే వారు చనిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇటలీకి చెందిన సైంటిస్టులు తేల్చారు. అలాగే కరోనా బారిన పడ్డవారు చికిత్స పొందుతున్న సమయంలోనూ వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
5. ఏపీలోక ఒత్తగా 8,012 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,89,829కు చేరుకుంది. 85,945 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,01,234 మంది కోలుకున్నారు. 2650 మంది చనిపోయారు.
6. కరోనా పరీక్ష చేసేందుకు గాను ఇప్పటి వరకు ముక్కులో స్వాబ్స్ ఉంచి శాంపిళ్లను సేకరిస్తున్నారు. వాటి ద్వారా టెస్టులు చేస్తున్నారు. అయితే అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కొత్తగా ఉమ్మి ద్వారా కరోనా టెస్టులు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
7. కర్ణాటకలో కొత్తగా 7,040 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,26,966కు చేరుకుంది. 1,41,491 మంది కోలుకున్నారు. 81,512 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,947 మంది చనిపోయారు.
8. మహారాష్ట్రలో కొత్తగా 11,111 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,95,865కు చేరుకుంది. 1,58,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,17,123 మంది కోలుకున్నారు. 20,037 మంది చనిపోయారు.
9. రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు ట్రయల్స్ చేపట్టేందుకు సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు ముందుకు వచ్చాయి. ఈ విషయాన్ని రష్యా తెలియజేసింది. ఈ మేరకు ఈ రెండు దేశాలతో రష్యా ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
10. భారత జట్టు మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ కరోనా బారిన పడి చనిపోయారు. హర్యానాలోని గురుగావ్‌లో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన సైనిక సంక్షేమం, హోం గార్డ్స్, పౌర భద్రత, ప్రాంతీయ రక్షాదళ్ మంత్రిగా పనిచేస్తున్నారు.