దేశభక్తిని చాటే ఓ జలపాతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘సమ్యాక్స్పీక్స్’ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో పెట్టారు. ఈ వీడియోలో మన జాతీయ జెండాలోని మూడు రంగులను అద్దుకున్న జలం పైనుంచి దూకుతూ చూసే వారికి ఒక మధురమైన అనుభూతి కలిగిస్తుంది. ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియో స్వాతంత్ర్య దినోత్సవం రోజే వైరల్ అయ్యింది.
How beautifully they created tricolour in a waterfall!!
Very creative!! #HappyIndependanceDay pic.twitter.com/EY9JqeHlUo— SamyakSpeaks (@samyakspeaks) August 15, 2020
ఈ వీడియోను బాలీవుడ్ ప్రసిద్ధ ఛాయాచిత్రకారుడు భయానీ కూడా తన ఇన్స్టాలో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ గర్వ పడేలా ఉంది. త్రివర్ణ పతాకంలా కనిపించేందుకు నీటి ప్రవాహానికి పైపుల ద్వారా రంగులనద్దారని తెలుస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు గర్వంతో జైహింద్ అంటూ రీట్వీట్ చేస్తున్నారు.