కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (03-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో గురు‌‌‌వారం (03-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 3rd september 2020

1. అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్రం ఇచ్చిన ఆంక్ష‌ల‌ సడలింపుల ప్రకారం హైదరాబాద్ మెట్రో రైలు స‌ర్వీసులు ఈ నెల‌ 7వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబందించిన విధి విధానాలను గురువారం ప్ర‌క‌టించారు.

2. వాహ‌నాల‌ను డ్రైవింగ్ చేసేవారు ఒక్క‌రే ఉంటే, వారితో ఇత‌ర ఏ ప్ర‌యాణికులూ లేకుంటే.. మాస్కుల‌ను ధ‌రించాలా, వ‌ద్దా అన్న విష‌యంపై ఇంకా కేంద్రం ఎలాంటి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌లేద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ సెక్రెట‌రీ రాజేష్ భూష‌ణ్ అన్నారు. అందువ‌ల్ల వాహ‌న‌దారుడు ఒక్క‌డే ఉంటే మాస్కుల‌ను ధ‌రించ‌డం, ధ‌రించ‌క‌పోవ‌డం అన్న‌ది స్వ‌విష‌య‌మ‌ని అన్నారు.

3. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 75 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,65,730కి చేరింది. ఇప్పటిదాకా మొత్తం 4,200 మంది మరణించారు.

4. క‌రోనా నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ మ‌ధ్య ఆర్‌టీసీ స‌ర్వీసులను తిరిగి న‌డిపేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించాల‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న గురువారం కేబినెట్ మీటింగ్‌లో చ‌ర్చించారు.

5. చ‌వ‌కైన, విస్తృతంగా లభించే స్టెరాయిడ్ మందులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే కరోనా రోగులకు కరోనా నుంచి బయటపడటానికి సహాయపడతాయని అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్ స్పష్టం చేశాయి.

6. తెలంగాణ‌లో 18 శాతం మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు కరోనా సోకుతుందని కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ కార్మికులలో కరోనా పాజిటివిటీ రేటు 18 శాతంగా ఉంద‌ని తెలిపింది.

7. దేశ వ్యాప్తంగా న‌మోదైన క‌రోనా మరణాల్లో 70 శాతం మ‌ర‌ణాలు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలోనివేన‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. దేశంలో ఒక విడత సీరో సర్వే ఇప్ప‌టికే పూర్తి కాగా తాజాగా రెండవ విడత సీరో సర్వే చేప‌ట్టారు.

8. బీసీసీఐ వైద్య బృందంలోని ఒక సభ్యుడు కరోనా బారిన పడ్డాడు. అతనికి కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే దుబాయ్‌లో ఉన్న సీఎస్‌కే టీంలో 13 మందికి క‌రోనా సోకింది.

9. దేశంలో కొత్త‌గా 83,883 క‌రోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య‌ 38 లక్షలు దాటింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 38,53,407కు చేరుకుంది. ఒక్కరోజులోనే 1,043 మంది కరోనాకు బలయ్యారు.

10. గడచిన 24 గంటల్లో తెలంగాణ‌లో కొత్త‌గా 2,817 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,33,406కి చేరుకుంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 10 మంది కరోనా వల్ల‌ చనిపోయారు. ఇప్పటి వ‌ర‌కు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 856కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news