కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో శనివారం వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఏపీలో గడిచిన 24 గంటల్లో 796 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,285కు చేరుకుంది. అక్కడ కోవిడ్ కారణంగా మొత్తం 157 మంది చనిపోయారు. 5,480 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 6,648 యాక్టివ్ కేసులు అక్కడ ఉన్నాయి.
2. కరోనాపై పోరాడుతున్న దేశాల్లో భారత్ చాలా మెరుగైన స్థితిలో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు కూడా పెరిగిందన్నారు.
3. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా కట్టడికి ఫైవ్ పాయింట్ ఫార్ములాను ప్రకటించారు. టెస్టులు పెంచడం, పడకలను సిద్ధం చేయడం, ఐసొలేషన్, ఆక్సీమీటర్ల పంపిణీ, ప్లాస్మా థెరపీ అనే 5 అంశాలను ఆయుధాలుగా చేసుకుని కరోనాపై పోరాటం చేస్తామని తెలిపారు.
4. కోవిడ్ మధ్యస్థ లక్షణాతోపాటు ఆక్సిజన్ సపోర్ట్‌పై, ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు డెక్సామిథసోన్ అనే స్టెరాయిడ్ మెడిసిన్‌ను వాడవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. ఈ మెడిసిన్ కోవిడ్ పేషెంట్లు చనిపోయే అవకాశాలను 1/3వ వంతు వరకు తగ్గిస్తుంది. అలాగే వారిలో ఉండే వాపులను తగ్గిస్తుంది.
5. దేశంలో నిత్యం పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను చూసి భయపడాల్సిన పనిలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేసుల సంఖ్య 5 లక్షలు దాటిందని.. అయినప్పటికీ భారత్ కోవిడ్‌ను ఎదుర్కొంటుందని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
6. దేశంలో ఉన్న యాక్టివ్ కేసులతోపాటు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 8 రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. మొత్తం యాక్టివ్ కేసులతో పోలిస్తే మహారాష్ట్ర, ఢిల్లీ తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఏపీ, పశ్చిమబెంగాల్‌లలోనే 85.5 శాతం వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయని, 87 శాతం వరకు మరణాలు ఈ రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నాయని తెలిపారు.
7. కర్ణాటకలో జూలై 5 నుంచి ఆదివారాల్లో రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ విధించనున్నారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే ఆ రోజు అనుమతి ఇస్తారు.
8. ఇంగ్లండ్ టూర్ కోసం పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్లు 20 మంది, మరో 11 మంది సహాయక సిబ్బంది ఆదివారం బయల్దేరనున్నారు. ఇటీవల 10 మంది పాక్ ప్లేయర్ల కరోనా శాంపిల్స్ పరీక్షంచగా వారిలో 7 మందికి కరోనా నెగెటివ్ వచ్చింది. మరో ముగ్గురు ప్లేయర్ల రిజల్ట్ రావల్సి ఉంది. అయినప్పటికీ వారు ఇంగ్లండ్‌కు ప్రయాణం కానున్నారు.
9. కర్ణాటకలో ఇటీవలే తన 99వ పుట్టినరోజును జరుపుకున్న మెర్సిలైన్ సల్దాన్హా అనే వృద్ధురాలు కరోనాను బీట్ చేసింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
10. ఉప్పు నీటితో ముక్కు లోపల శుభ్రం చేసుకుని, గొంతులో ఆ నీటిని పోసుకుని పుక్కిలిస్తే జలుబు తగ్గుతుందని తేలడంతో సైంటిస్టులు కొందరు కోవిడ్ పేషెంట్లపై ఉప్పు నీటి ప్రయోగం చేపట్టారు. ఆ వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి.