కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నష్టం వాటిల్లింది. జననష్టం, ఆస్తి నష్టం సహా అన్ని నష్టాలు అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో చాలా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడ్డ వాటిల్లో ఒలింపిక్ గేమ్స్ కూడా ఉన్నాయి. గత ఏడాది జరగాల్సిన ఈ ఆటలు, ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. టోక్యో వేదికగా మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఐతే ఈ ఆటలకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడం లేదు.
ఈ మేరకు జపాన్ ప్రధాని యోషిండే చెప్పుకొచ్చారు. జపాన్ లో కోవిడ్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ఈ నెల 12వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు కోవిడ్ ఎమర్జెన్సీ ఉంటుందని, అందువల్ల ఒలింపిక్ ఆటలు చూడడానికి ప్రేక్షకులను అనుమతి ఉండబోదని స్పష్టం చేసారు. ప్రపంచ దేశాలు పోటీ పడే వివిధ ఆటలను ప్రత్యక్షంగా చూడలేకపోవడం క్రీడాభిమానులకు బాధాకరమే.