ఏపీలో ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సిన్…?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వాక్సిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పీడ్ గా అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే గ్లోబల్ టెండర్ లకు వెళ్తుంది ఏపీ సర్కార్. ఇక కేంద్రం నుంచి సరైన సహకారం లేకపోయినా సరే ఏపీ సర్కార్ పెద్దలు మాత్రం అప్పు చేసి అయినా సరే ప్రజలకు ఈ విషయంలో న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే నిధుల సమీకరణ మీద కూడా దృష్టి పెట్టారు.

ఇక కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒక ప్రకటన చేసింది. ఏపీలో కోటి మందికిపైగా కోవిడ్ టీకాలు వేశామని తెలిపింది. మొదటి డోసు తీసుకున్నవారు 74,92,944 గా తెలిపింది. రెండు డోసులూ తీసుకున్నవారు 25,24,768 అని వివరించింది. మొదటి, రెండో డోసులు తీసుకున్నవారు 1,00,17,712 గా తెలిపింది.