కేటిఆర్ ట్విట్టర్ ఖాళీ లేదుగా…? మరీ ఇలానా…?

ఈనెల 15 నుండి రైతుల ఖాతాలో రైతు బంధు జమ చేయనుంది తెలంగాణా ప్రభుత్వం. ఈ నేపధ్యంలో ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు వినతులు భారీగా వస్తున్నాయి. రెవెన్యూ సమస్యలను పరిష్కరించడం లేదంటూ ట్విట్టర్ లో విమర్శలు చేస్తున్నారు జనాలు. ఏండ్లుగా పరిష్కారం దొరకడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను ట్విట్టర్ వేదికగా మంత్రి దృష్టికి తీసుకువస్తేనన్న పరిష్కారం అవుతాయని భావనలో భాగంగా కేటిఆర్ కి వివరిస్తున్నారు.

వ్యవసాయ భూముల సమస్యలపై చిక్కులు ఇంకా వీడలేదు. ధరణి పోర్టల్ లో ఉన్న సాంకేతిక సమస్యల తమకు శాపంగా మారాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల పని తీరు, అలసత్వం, నిర్లక్ష్యం పై నెటిజన్ లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.