కోవిడ్ 19 వ్యాక్సిన్: ఇప్పుడు 18 ఏళ్లు దాటిన వాళ్ళు కోవిన్ యాప్ ద్వారా ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు..!

-

కరోనా వ్యాక్సిన్ 18 ఏళ్లు దాటిన వాళ్ళు కోవిన్ వ్యాక్సిన్ కోసం ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళు ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ మరియు అపాయింట్మెంట్ చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది.

అయితే ఈ ఫీచర్ కేవలం ప్రభుత్వ కోవిడ్ వాక్సినేషన్ సెంటర్స్ కి మాత్రమే వర్తిస్తుంది. అదే విధంగా ఆయా రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీస్ ప్రభుత్వ నిర్ణయం మీద మాత్రమే ఇది పని చేస్తుంది.

రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ కి సంబంధించి ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ అనుమతి ఇస్తేనే కుదురుతుంది. 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల వయసు వాళ్లకి ఇప్పుడు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.

యూనియన్ హెల్త్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి మరియు యూనియన్ టెర్రిటరీస్ కి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్స్ ని కోరారు. రిజిస్ట్రేషన్ మరియు అపాయింట్మెంట్ ఫీచర్ విషయం లో తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉండాలని అన్నారు అదే విధంగా వ్యాక్సిన్ సెంటర్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎక్కువ మంది గుంపులుగా ఉండకూడదని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news