నేను క్షేమంగానే ఉన్నాను: కమిషనర్ శాండిల్య

సరిగ్గా రెండు గంటల క్రితం నుండి హైదరాబాద్ కమిషనర్ అఫ్ పోలీస్ గా విధులను నిర్వరిస్తున్న సందీప్ శాండిల్య ఆరోగ్యానికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. సందీప్ శాండిల్యకు హార్ట్ అటాక్ వచ్చిందని, ఆయన్ను వెంటనే అపోలో హాస్పిటల్ కు తరలించారని ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు వచ్చింది. కానీ వాస్తవంగా సందీప్ శాండిల్య కు చిన్న సమస్యపై హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని స్వయంగా ఆయనే తెలియచేశారు. విధుల్లో ఉండగా తల తిరిగినట్లు అనిపిస్తే అపోలో హాస్పిటల్ కు వచ్చినట్లు తెలిపారు, అక్కడ పరీక్షలు చేయగా స్పాండిలైటిస్ మరియు లో బీపీ గా తేలినట్లు శాండిల్య స్పష్టం చేశారు. మీరు ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదంటూ అధికారికంగా తెలియచేశారు. సాయంత్రం లోపు డీఛార్జి అయ్యి రేపటి నుండి యధావిధిగా విధులకు హాజరవుతానని శాండిల్య తెలిపారు.

ఈయన స్పష్టం చేయడంతో శాండిల్యకు హార్ట్ అటాక్ అంటూ వచ్చిన వార్తలకు తెరపడింది. అందుకే ఒక వార్తను వైరల్ చేసేటప్పుడు పూర్తిగా తెలుసుకుని చేయాలి.