టీమిండియా వన్డే సిరీస్ పై గురి పెట్టింది. వెస్టీండిస్ తో నేడు రెండో వన్డే జరుగనుంది. మొదటి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్ పై గురి పెట్టింది. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచి ఇండియా ఫుల్ జోష్ లో ఉంది. దీంతో రెండో వన్డేలో ఒత్తడి లేకుండా ఆడనుంది.
మరో వైపు కరేబియన్ జట్టు .. ఇండియా దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. పవర్ హిట్టర్లు ఉన్నా.. విండీస్ జట్టు చెలరేగకుండా భారత బౌలర్లు అడ్డుకట్ట వేశారు. ఇదిలా ఉంటే మొదటి వన్డే జరిగిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లోనే రెండో వన్డే జరుగనుంది. దీంతో పిచ్ కూడా మొదటి వన్డేలాగే ఉండే అవకాశం ఉంది. తొలి వన్డేలో భారత బౌలర్ల స్పిన్ ఉచ్చులో విండీస్ బ్యాటర్లు విలవిల్లాడారు. రెండో వన్ డేలో కూడా స్పిన్నర్ల కీలకం కానున్నారు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ సూపర్ ఫామ్ భారత్ కు కలిసి వచ్చే అంశం. ఇదిలా ఉంటే రోహిత్ శర్మకు జోడిగా.. ఈ వన్డేలో కేఎల్ రాహుల్ జోపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఒక వేళ రాహుల్ తుది జట్టులోకి తీసుకోకుంటే తొలి వన్డే లాగే ఇశాంత్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.
తుది జట్లు (అం చనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, పం త్, సూర్య కుమార్, దీపక్ హుడా, సుం దర్, శార్దూల్, సిరాజ్, చాహల్,
ప్రసిద్ధ్ కృ ష్ణ.
వెస్టిం డీస్: పొలార్డ్ (కెప్టెన్), హోప్, బ్రాం డన్, బ్రావో, బ్రూక్స్ , పూరన్, హోల్డర్, అలెన్, అకీల్, అల్జారీ, రోచ్.