నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో 120 ఐసియూ బెడ్లను ప్రారంభించారు. అయితే.. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ..కోవిడ్ వైరస్ చాలా మంది జీవితాల్లో చీకట్లు నింపిందని… ఏంతో మంది ఆస్పత్రులలో బెడ్స్ లేక ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటి లెటర్ బెడ్స్ దొరకక ప్రాణాలు కోల్పోయారని… ప్రతి కుటుంబం లో ఒక్కరైనా ఈ మహమ్మారికి బలయ్యారని తెలిపారు. పేద వారికి అలాంటి ఇబ్బంది థర్డ్ వేవ్ లో రావొద్దనే యువికేన్ ఫౌండేషన్ మిషన్ 1000 బెడ్స్ ప్రాజెక్ట్ చేపట్టామని స్పష్టం చేశారు. మా ఫౌండేషన్ కు అండగా నిలుసున్న అందరికి ధన్యవాదాలు చెప్పారు యువరాజ్ సింగ్. నిజామాబాద్ ఆసుపత్రి లో మెరుగైన సేవలకు ఈ ఐసియూ బెడ్లు చాలా ఉపయోగపడతాయని తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ప్రజలందరూ చాలా జాగ్రత్తలు పాటించాలని యువరాజ్ సింగ్ పేర్కొన్నారు.