అలా జరిగిన కూడా బీజేపీకి కష్టమేనా?  

-

అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణలో బీజేపీ పుంజుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌పై నిదానంగా వ్యతిరేకిత పెరగడం, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వీక్ కావడంతో బీజేపీకి ఛాన్స్ దొరికింది. పైగా దుబ్బాక ఉపఎన్నికలో గెలిచాక ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అలాగే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు దాదాపు చెక్ పెట్టినంత పనిచేసింది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని అంతా అనుకున్నారు. అటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా రాజకీయాలు చేయడం కలిసొచ్చింది. ఇతర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలోకి రావడం మొదలైంది.

కానీ రేవంత్ రెడ్డి ఎఫెక్ట్‌తో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. రేవంత్ పీసీసీ అయ్యాక, కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. అధికార టీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీనే పోటీ ఇస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లోకి రావడానికి చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన కొందరు నాయకులు వరుసపెట్టి ఆ పార్టీని వదిలిపెడుతున్నారు. ఇప్పటికే మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డి లాంటి వారు టీఆర్ఎస్‌లోకి వెళ్లడానికి చూస్తున్నారు. అటు ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ స్వచ్చభారత్ కమిటీ కో కన్వీనర్ యోగీశ్వర్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేశారు. అలాగే హుజూరాబాద్‌లో పలువురు నాయకులు బీజేపీకి రాజీనామా చేశారు.

ఈ పరిస్తితి ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. ఒకవేళ హుజూరాబాద్‌లో బీజేపీ గెలిచిన కూడా ఆ విజయం ఈటల రాజేందర్ ఖాతాలోకి వెళుతుంది కాబట్టి, ఆ తర్వాత కూడా బీజేపీకి గడ్డుకాలమే ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో బీజేపీ రాజకీయాలు ఎలా ఉంటాయో.

Read more RELATED
Recommended to you

Latest news