ఉత్తర ప్రదేశ్ లో దారుణం..ఒమీక్రాన్ భయంతో భార్య పిల్లలను చంపేసిన డాక్టర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో కట్టుకున్న భార్య అలాగే పిల్లలను చంపేశాడు ఓ డాక్టర్. రెండు సంవత్సరాలుగా కరోనా భయంతో డిప్రెషన్ లోకి వెళ్ళిన డాక్టర్ సుశీల్ సింగ్… కొత్త వేరియంట్ ఒమీ క్రాన్ నుంచి తన కుటుంబానికి విముక్తి కలిగించాలని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

crime
crime

కొత్త వేరియంట్ భయం నేపథ్యంలోనే… భార్య చంద్రప్రభ, కుమారుడు శిఖర్ శింగ్, కుమార్తె ఖుషి సింగ్ లను దారుణంగా హత్య చేశాడు డాక్టర్ సుశీల్ సింగ్. ఏదో ఒకరోజు కరోనా బారిన పడక తప్పదు అని భావించి పిచ్చి పిచ్చి ఆలోచనలతో సుశీల్ సింగ్ కుంగిపోయాడు. ఈ తరుణంలోనే భార్య పిల్లల్ని ముగ్గుర్ని చంపేసి… ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు సుశీల్ సింగ్. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా… దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఓమీ క్రాన్ కేసులు నాలుగు నమోదయ్యాయి.