దేశ వ్యాప్తంగా విమానా లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య గణనీయం గా పెరగడంతో కొత్త ఎయిర్ పోర్ట్ లు అవసరం ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ముఖ్యం గా మెట్రో నగరా ల్లో రెండు ఎయిర్ పోర్ట్ తప్పక ఉండాలని ఆయన అభిప్రాయ పడ్డాడు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ తో పాటు బెంగళూర్ వంటి మెట్రో నగరాల లో ఉన్న ఎయిర్ పోర్ట్ ల లో రద్దీ ఎక్కువ ఉందని అన్నారు.
అయితే ఢిల్లీ తో పాటు ముంబై నగరాల ల్లో ఇప్పటికే కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణ ప్రక్రియా కొనసాగుతుందని తెలిపారు. అయితే హైదరాబాద్ తో పాటు కోల్ కత్త, బెంగళూర్ వంటి నగరాల్లో రెండో ఎయిర్ పోర్టు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాబోయే 100 రోజులలో 5 కొత్త ఎయిర్ పోర్టులు, 6 హెలీ పోర్టులు, 50 ఉడాన్ రూట్లను ప్రారంభిస్తామని అన్నారు. ప్రారంభించడం వీలు కాక పోయిన శంకుస్థాపన అయినా.. చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ఈ 5 కొత్త ఎయిర్ పోర్టు లలో హైదరాబాద్ ఉంటుందా.. అనే ది క్లారిటీ లేదు.