దారుణం: ప్రకాశం జిల్లాలో “దిశ” చట్టానికి పని పడింది!

-

ఏ ప్రభుత్వం ఎన్ని శిక్షలు వేసినా.. ఏ ప్రభుత్వం ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా… కామాందులకు మాత్రం భయం లేకుండా పోతుంది! తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. 11 ఏళ్ల బాలికపై తండ్రి వయసు ఉన్న ఓ దుర్మార్గుడు అత్యాచార యత్నం చేశాడు. జగన్ ఎంతో పక్కాగా, ఎంతో దూరదృష్టితో దిశ చట్టం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ద్వారా నిందితులకు 21 రోజుల్లోనే శిక్ష పడుతుంది. సరైన సాక్ష్యాధారాలు ఉంటే వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు ,14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చేయేడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ చట్టానికి ప్రకాశం జిల్లాలో పని పడిందనే చెప్పాలి!

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలునిపల్లి గ్రామంలో కుటుంబసభ్యులు ఎవరూ లేరని గ్రహించిన 48 ఏళ్ల వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఒక బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో బాలిక అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. ఈ పాశవిక చర్యనుంచి తప్పించుకున్న ఆ అమ్మాయి కేకలు – అరుపులు వేసింది. దీంతో భయంతో ఆ ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టాడు ఆ దుర్మార్గుడు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను బెదిరించాడు. ఎవరికైనా చెబితే చంపుతామని హెచ్చరించాడు. దీంతో బాధితులు భయపడి జరిగిన ఘటనను దాచుకున్నారు. అయితే ఆ నోట ఈ నోట ఈ వార్త తెలిసి చివరకు బహిర్గతమైంది. అన్యాయాన్ని ధైర్యంగా ఎవరికి చెప్పలేని వారి పరిస్థితి కొందరు అండగా నిలిచారు.

కాగా… దేశంలోనే మొదటిసారిగా చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల అదుపునకు “దిశ చట్టాన్ని” జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ దిశ బిల్లు అమలుకు ప్రభుత్వం రూ. 87 కోట్లు ఇప్పటికే కేటాయించడంతోపాటు… 13 ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news