ఘరానా కపుల్..పేరు మార్చి రూ.32 లక్షలు దోచేశారు

-

పెళ్లి అంటే..కోరి తెచ్చుకునే ఓ తోడు. సర్టైన్ ఏజ్ లో పెళ్లిచేసుకునే వాళ్లు సరిగ్గా ఇలానే కోరుకుంటారు. ఈ పాయింట్ నే క్యాష్ చేసుకున్నారు కొందరు మోసగాళ్లు. ఎదుటివారి ఒంటరితనాన్ని తమ బిజినెస్ గా మార్చుకున్నారు ఆ కన్నింగ్ కపుల్. ఓ యువతికి టోకరా వేసి ఏకంగా రూ. 32లక్షలు కాజేశారు. భర్త దొంగపెళ్లికొడుకుగా ఈ దారుణానికి భార్యతోడైంది. ఇద్దరూ కలిసి ఓ అమాయుకురాలి దగ్గర డబ్బుకాజేశారు. ఈ ఘటన జరిగిందో ఎక్కడో కాదు..గుంటూరు జిల్లాలోనే. వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ మహిళ.. అబ్బూరులోని ఓ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంది. ఆమె రెండో వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ మ్యాట్రిమోనీ సైట్ లో తన వివరాలు ఉంచింది. ఈ క్రమంలోనే.. కార్తీక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తమది గుంటూరు జిల్లా తెనాలి అని.. చెన్నై ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయినట్లు ఆమెను నమ్మించాడు ఆ కార్తీక్.. నువ్వు బాగా నచ్చావని.. పెళ్లి చేసుకుంటానని బుట్టలో పడేశాడు. కొన్నిరోజుల తర్వాత ప్లాన్ అమలు చేశాడు.

అదేంటంటే.. తన కుటుంబానికి చెందిన ఆస్తులను నోట్లరద్దు సమయంలో విక్రయించాడట…. ఆ సమయంలో కోట్లాది రూపాయల డబ్బు బ్యాంక్ లో ఉందని చెప్పాడు. ఆ డబ్బును ఐటీ అధికారులు నిలిపేశారని.. ప్రస్తుతం అది చెన్నై కోర్టులో ఉందని మనోడు పిట్టకథ చెప్పాడు. పాపాం ఆ అమాయకురాలు కార్తీక్ మాటలను నమ్మేసింది. ఐటీ అధికారులకు డబ్బులిస్తే కోట్లాది రూపాయలు సొంతమవుతాయని చెప్పి ఆమె దగ్గర రూ.32 లక్షలు తీసుకున్నాడు. తన మేనత్త ఖాతాలో డబ్బులు వేయాలంటూ ఓ ఎకౌంట్ నెంబర్ ఇచ్చాడు. అతడు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన మహిళ.. అప్పుచేసి మరీ సదరు ఎకౌంట్ లో డబ్బులు జమ చేసింది.

అయితే..డబ్బు దక్కాగా…కార్తీక్ మాట్లాడటం మానేశాడు.. కొంతకాలం కార్తీక్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అప్పుడు అర్థమైంది… మోసపోయానని గ్రహించింది. పూర్తి వివరాలు ఆరా తీయగా తనకు పరిచయమైన వ్యక్తిపేరు కార్తీక్ కాదని.. అతడి పేరు మహరాజ్ జానీ రెక్స్ అని.. అతడికి పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తేలింది.

ఇచ్చిన ఎకౌంట్ నెంబర్ తన మేనత్తది కాదని.. భార్యదని తెలుసుకొని బాధితురాలు దిమ్మతిరిగింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న జానీ రెక్స్.. ఇల్లు వదిలి పారిపోయాడు. మోసంలో భర్తకు సహకరించిన భార్య మహరాజ్ ప్రియను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ భార్యాభర్తలిద్దరు గతంలో అనేక మందిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అయినా మ్యాట్రిమోనీలో చూసి కేవలం బ్యాక్ గ్రౌండ్ వెరిఫై చేయకుండా ఆ మహిళకూడా స్టెప్ తీసుకోని ఉండాల్సింది కాదు..ఇలాంటి మోసాల్లో బాగా చదువుకున్నవారే బాధితులు అవ్వటం గమనార్హం. ఎదుటువారు మాట్లాడే మాటలను నిజంగా ప్రేమే అనుకోవటం తప్పు..ఒకటికిపదిసార్లు ఆలోచించాలి..ఆలోచించి చేయటానికి ఇది బిజినెస్ కాదు ప్రేమ..ఎప్పుడు పుడుతుందో ఎవరికి తెలియదు అనే డైలాగ్స్ సినిమాల్లో చెప్పటానికి బానే ఉంటాయి..కానీ నిజజీవితంలో అన్నీ ఆలోచించే..మన లెక్కలెన్నీ వేసుకున్నాకే..కరెక్టే సెట్ అవుతారు అనుకుని స్ర్టాంగ్ గా నిర్ణయించుకున్నాకే స్టెప్ తీసుకోవాలి..చూడగానే ప్రేమిస్తే..దాదాపు మోసపోక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news