ములుగు లో దారుణం.. దిగుబ‌డి రాలేద‌ని రైతు ఆత్మ‌హ‌త్య‌

వేసిన పంట నుంచి దిగుబ‌డి రాలేద‌ని రైతు మాన‌స్థాపానికి గురి అయ్యాడు. దీంతో పొలంలో నే పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ములుగు మండ‌లంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే ములుగు మండ‌లంలోని స‌ర్వాపురం గ్రామంలో గ‌ట్టు తిరుప‌తి అనే రైతు ఉండేవాడు. తిరుప‌తి త‌న‌కు ఉన్న ఎక‌రన్న‌ర పొలంలో వ‌రి సాగు చేశాడు. అయితే అనేక రోగాలు ఇత‌ర కార‌ణాల‌తో దిగుబ‌డి రాలేదు.

పంటకు రోగాలు పోవాల‌ని ఎన్ని సార్లు క్రిమ సంహార‌క మందులు పిచికారీ చేసినా దిగుబాడి రాలేదు. ఈ పంట కోసం అప్పు చేసినా.. లాభం రాలేదు. దీంతో రైతు తిరుప‌తి మ‌న‌స్తాపానికి గురి అయ్యాడు. దీంతో పొలం వ‌ద్దనే పురుగుల మందును తాగి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. మృతుడు తిరుప‌తికి భార్య గీత తో పాటు ఒక కుమారుడు ఉన్నారు. కాగ ఈ మ‌ధ్య కాలంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.