ఖమ్మం జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం

నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన దుర్మార్గులు దారుణాలకు ఒడిగడుతున్నారు. పసి పెద్దలు మొదలుకొని వృద్ధులను సైతం వదలడం లేదు. దేశం లో ఏదో ఒక మూలన అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బ తండలో ఈ ఘటనన చోటుచేసుకుంది. తండాకు చెందిన మైనర్ బాలిక ఇంటర్ చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వచ్చిన బాలిక.. సోమవారం తల్లిదండ్రులు పనులకు వెళ్ళగా ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా భావించిన ముగ్గురు యువకులు వంశీ, వీరేందర్, పుల్లారావులు ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాలిక కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.