సీఎం కేసీఆర్ ఆదేశిస్తే..మునుగోడులో పోటీ చేస్తానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని ఆగ్రహించారు. రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా అని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా బిజెపికి అవసరమని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమని హెచ్చరించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో నాకు ఆసక్తి లేదు.. సంతృప్తిగా ఉన్నానని..
సీఎం కేసీఆర్ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తిండి ఎక్కువై రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చురకలు అంటించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉన్నదాని కంటే ఎక్కువ ఊహించుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మొదటి నుండి అలవాటు అని ఎద్దేవా చేశారు బిజెపి లో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరని తేల్చి చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ అక్కడ గెలుస్తుందని స్పష్టం చేశారు.