బెంగళూర్ లో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు…. తనిఖీ చేస్తున్న పోలీసులు

బెంగళూర్ లో బాంబ్ కలకలం రేగింది. తరగతి గదుల్లో బాంబులు పెట్టినట్లు ఏడు స్కూళ్లకు మెయిల్ రావడంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కి పడింది. ఈ బెదిరింపు మెయిళ్లతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్వ్కాడ్ తో తరగతి గదులను క్షణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఏ స్కూల్ లోను బాంబులు దొరకలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిళ్లపై నగర పోలీసులు విచారణ జరుపుతున్నట్లు బెంగళూర్ సిటీ కమిషనర్ కమల్ పంత్ వెల్లడించారు. స్కూళ్లను బాంబ్ స్వ్కాడ్ చెక్ చేస్తుందని తెలిపారు. 

కాగా.. ఇప్పటి వరకు బెదిరింపు ఈమెయిల్ కు సంబంధించి ఏమీ కనుక్కోలేదని.. ఓ వ్యక్తని అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని బెంగళూర్ రూరల్ ఎస్పీ అన్నారు. బెంగళూర్ రూరల్ పరిధిలోని హెబ్బగోడి, బన్నెరఘట్టలోని 2 పాఠశాలకలకు కూడా బెదిరింపులు వచ్చాయని ఎస్పీ వెల్లడించారు. విచారణ జరుగుతుందని ఆయన అన్నారు.