ఇంత ఘోరమైన యాక్సిడెంట్ ను మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు…

-

యాక్సిడెంట్.. అది ఎవరి నిర్లక్ష్యమైనా కావచ్చు.. కానీ… జీవితమే పోతుంది. ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదు. కానీ… వాహనాల డ్రైవర్లు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల జీవితాలనే కోల్పోతుంటారు చాలామంది. రోడ్ సేఫ్టీపై ఎన్నిరకాలుగా అధికారులు, పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా యాక్సిడెంట్లు మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అటువంటిదే. ఘోరమైన యాక్సిడెంట్ అది. ఎంత ఘోరం అంటే యాక్సిడంట్ తర్వాత మృతదేహాలు చెల్లాచెదురుగా రోడ్డు మీద పడిపోయాయి. యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. మూడు బస్సులు ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మృతుల సంఖ్య కూడా పెరిగింది. అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఘటనపై నెటిజన్లు కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. అయ్యో.. ఇంత ఘోరమైన యాక్సిడెంటా అంటూ బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version