మందలించాడని.. కన్నతండ్రినే చంపేశాడు కొడుకు..!

-

అనిల్ ఖేరా

కొడుకు.. అంటే తల్లిదండ్రులను పున్నామనరకం నుంచి కాపాడుతాడని నమ్మకం. అందుకే చాలామంది తల్లిదండ్రులు కొడుకు పుట్టాలని ఆశ పడుతుంటారు. తమకు తలకొరివి పెడతాడని అనుకుంటారు. కానీ.. నేటి సమాజం.. పెడదోరణికి అలవాటు పడి.. ఎటు పోతుందో అర్థం కావడం లేదు. కేవలం డబ్బు మీద ఉన్న వ్యామోహంతో చెడు అలవాట్లకు బానిసలవుతున్న వ్యక్తులు.. కన్నతండ్రులు అని కూడా చూడకుండా దారుణానికి ఒడి కడుతున్నారు. దానికి ఉదాహరణే ఇప్పుడు మనం చదవబోయే కథనం.

న్యూఢిల్లీకి చెందిన అనిల్ ఖేరా కెమికల్ వ్యాపారి. అతడికి కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. అతడి కొడుకు గౌరవ్(37).. పెళ్లయి పిల్లలు ఉన్నా ఇంకా ఏ పనీ లేకుండా తిరుగుతూ తాగుడు, జూదం, అమ్మాయిలకు బానిసయ్యాడు. తండ్రి సంపాదనపై ఆధారపడి బతుకుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బు పోగొట్టుకున్న గౌరవ్.. ఇంటికి వచ్చి తన తండ్రిని డబ్బు అడిగాడు. దీంతో అనిల్ ఖేరా కోపంతో అతడిని అవమానించి కొట్టాడు. దీంతో తండ్రిపై కక్ష పెంచుకున్న గౌరవ్.. తండ్రిని చంపడానికి ప్లాన్ వేశాడు. తండ్రిని చంపేస్తే తండ్రి ఆస్తి కూడా తనకే వస్తుందని ఆశ పడ్డాడు. దీంతో తన ఫ్రెండ్స్ సాయంతో ఇద్దరు కిల్లర్స్ ను తన తండ్రిని చంపడానికి 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అనిల్ ఓ రోజు తన కంపెనీలో మీటింగ్ కు అటెండ్ అయి వస్తుండగా… బయట వేచి ఉన్న ఆగంతకులు అనిల్ ను సమీపం నుంచి కాల్చి చంపేశారు.

ఈ ఘటన జరిగింది మే 21, 2018న. అప్పటి నుంచి పోలీసులు ఈ కేసుపై విచారణ చేపడుతున్నప్పటికీ.. ఆ ఘటనపై సరైన ఆధారాలు సేకరించలేకపోయారు. ఇటీవలే అనిల్ హత్యపై సరైన ఆధారాలు సేకరించగలిగారు. అనిల్ ను చంపింది తన సొంత కొడుకు గౌరవ్ అని తేల్చేశారు. దీంతో గౌరవ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news