యువతితో శృంగారం..నగ్న ఫోటోలు బయట పెడతామంటూ !

-

కపిలేశ్వరపురం వడ్లమూరుకు చెందిన మానక రాజేష్ తనపై అత్యాచారం చేశాడంటూ అదే గ్రామానికి చెందిన 31 ఏళ్ల యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అంగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాది 2018 నుంచి విజయవాడలోని ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూలీగా పనిచేస్తుంది.

తనను ప్రేమించాలంటూ నిందితుడు రాజేష్ వేధించేవాడని, తర్వాత తన సమ్మతి లేకుండా శారీరకంగా అనుభవించాడని, పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తిరస్కరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో సన్నిహితంగా ఉండగా తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంగర పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news