11 ఏళ్ల బాలికపై గత 5ఏళ్లుగా కన్న తండ్రి, అన్న లైంగిక దాడి !

దేశంలో దారుణాలు అంతకంతకు పెరిగి పోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే మరొకరు అండగా నిలవాల్సిన బంధువులే అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, రక్షణ ఇవ్వాల్సిన అన్న, తాత, మేనమామ ఇలా అంతా కీచకులుగా మారారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మహారాష్ట్ర పూణేలో చోటు చేసుకుంది.

మైనర్ బాలికపై సొంత తండ్రి, సోదరుడు, ఒకరికి తెలియకుండా ఒకరు లైంగిక దాడి చేస్తున్నారు. 11 ఏళ్ల సోదరుడు కూడా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడటం షాకింగ్ కలిగిస్తోంది. బీహార్ కు చెందిన ఓ కుటుంబం కొంత కాలం క్రితం పుణే వచ్చారు. అక్కడే బాలిక చదువుకుంటోంది. అయితే ఇటీవల పాఠశాలలో ‘ గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ పై మాట్లాడుతూ… తనకు జరిగిన అన్యాయం గురించి పెదవి విప్పింది.

ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం పోలీసుకు ఫిర్యాదు చేసింది. 2017లో బీహార్ లో ఉన్నప్పటి నుంచే బాలిక తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీస్ అధికారి అశ్విని సత్పుటే చెప్పారు. ఘటనలో పాలుపంచుకున్న వారందరిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. అంతేకాదు.. బాలిక సోదరుడు మరియు తండ్రి (45)పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 కింద అత్యాచారం కేసు నమోదు చేశారు.