మొబైల్‌ అప్లికేషన్స్‌లో పెట్టుబడి అంటూ బడా మోసం!

-

మంచి వ్యాపారం, పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం గడింవచ్చంటూ సైబర్‌ మోసగాళ్లు కొత్త ర కం మోసానికి తెగబడ్డారు. రోజుకో మార్గం ఎంచుకుంటూ అమాయకులకు ఎర వేస్తున్నారు. వారి వలలో పడిన మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనే ∙ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.


ప్రముఖ చానల్‌ లో పనిచేస్తున్న యువతికి మాయ మాటలు చెప్పి మోసపోయి నగదు పోగొట్టుకుంది. ఇలా ప్రతి రోజు నగరంలో ఏడు, ఎనిమిది ఫిర్యాదులు వస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. మొబైల్‌ అప్లికేషన్స్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి పలువురి నుంచి రూ. 14 లక్షలు కొల్లగొట్టారు సైబర్‌ మోసగాళ్లు. ఓ చానెల్‌లో పనిచేస్తున్న యువతికి గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఓ వాట్సాప్‌ లింక్‌ వచ్చింది. మొదట దానిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఓ వ్యక్తి ఫోన్
చేసి ఆ లింక్‌ గురించి చెప్పాడు. ప్రస్తుతం కరోనా వేళ ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుందని నమ్మించాడు.

అతని మాటలు నమ్మిన సదరు యువతి లింక్‌ ఓపెన్ చేసి తొలుత రూ. 10వేలు పెట్టుబడి పెట్టింది. వెంటనే రోజుకు రూ. వెయ్యి చొప్పున ఐదు రోజులు రిటర్న్స్‌ జమ అయ్యాయి. దీంతో ఆమె నిజమని నమ్మేసింది. దీంతో ఆమె రూ. 40వేలు, మరోసారి 50వేలు పెట్టింది. ఇలా విడతల వారీగా రూ. 5 లక్షలు పెట్టింది. ఆ తరువాత రోజు నుంచి డబ్బులు రావడం ఆగిపోయాయి. అనుమానం వచ్చి వెంటనే ఫోన్‌ చేసింది. వారి ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో మోసపోయానని గుర్తించి సైబర్‌ క్రై పోలీసులను ఆశ్రయించింది. ఇలా నమ్మే వరకు ఫోన్లు చేసి తర్వాత ఆవ చూపి బురిడీ కొట్టిస్తున్నారు.

ఈ తరహా కేసులపై 10 రోజుల వ్యవధిలో 8 ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకొని చోరీ సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. ఇలాంటి మోసాలను నమ్మకూడదని పోలీసులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news