ఫేక్ కాల్ సెంటర్ తో మోసాలకు పాల్పడుతున్న సైబర్ గ్యాంగ్ ను పట్టుకున్నారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ గ్యాంగ్ లో 9 అరెస్ట్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి మహేష్ భగవతి మాట్లాడుతూ…బీహార్, వెస్ట్ బెంగాల్ ,కేంద్రంగా తెలుగు వాళ్ల తో కాల్ సెంటర్ రన్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామన్నారు. కోల్ కత్తా కేంద్రంగా ఈ ముఠా ఫేక్ కాల్ సెంటర్ నిర్వహిస్తుందన్నారు.
ప్రధాన నిందితుడు ఉత్తమ్ కుమార్ తో పాటు మరో 8 మంది ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఉత్తమ్ కుమార్, ముడవత్ రమేష్ తో కలిసి 2017 నుంచి తెలుగు కాల్ సెంటర్ నిర్వహిస్తున్నాడని.. ఈ ముఠా ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో వస్తువులు కొనుగోలు చేస్తున్న వారిని టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నారని అన్నారు. మీరు నాప్తోల్ లో షాపింగ్ చేశారు ,స్క్రాచ్ కార్డ్స్ లో మీకు లక్కీ డ్రా లో కారు వచ్చింది అంటూ ఈ ముఠా చార్జీల పేరిట డబ్బులు వసూలు చేసి మోసాలు చేస్తున్నారని తెలిపారు.