చికోటి ప్రవీణ్ విచారణలో కీలక ఆధారాలు సేకరించిన ఈడి

-

క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీపై చీకొటి ప్రవీన్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు ప్రవీణ్. విచారణలో కీలక ఆధారాలు సేకరించారు ఈడి అధికారులు.క్యాసినో నిర్వహణ , నగదు చెల్లింపుల పై ఈడి ఆరా తీసింది. ఇక్కడి నుండి ఇతర దేశాలకు కస్టమర్లను తరలించే ముందు టోకెన్ విధానం అమలు చేసినట్లు గుర్తించింది.

క్యాసినో ఆడేందుకు కస్టమర్ల నుండి నగదు తీసుకుని వారికి ఇక్కడే టోకెన్ లు జారీ చేశారని,విదేశాల్లో ఆడాలంటే ఇక్కడి కరెన్సీని ఫారిన్ కరెన్సీగా ముందే ఎక్సేంజ్ చేసినట్లు గుర్తించారు.భారీగా ఫారిన్ కరెన్సీ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు కాబట్టి చికోటి ప్రవీణ్ ముందే టోకెన్ విధానం అమలు చేసినట్లు తెలిపారు.కస్టమర్లు వారికి కావాల్సిన నగదు ఇక్కడ ఇస్తే దానికి తగ్గ టోకెన్ లు జారీ చేసేవారట. ఈ టోకెన్ లతో విదేశాల్లో క్యాసినో నిర్వహించేవారు. క్యాసినో ముగిశాక ప్రైజ్ మనీ సైతం టోకెన్ విధానం లోనే చెల్లించినట్లు గుర్తించారు.

విదేశాల్లో టోకెన్ తీసుకున్నాకా తిరిగి హైదరాబాద్ వచ్చాక నగదు చెల్లించినట్లు తెలిపారు.టోకెన్ జారీ, చెలింపుల ద్వారా చీకోటి ప్రవీణ్ ఫెమా ఉలంఘనకు పాల్పడినట్టు తెలిపారు. అతని వద్ద విదేశీ బ్యాంక్ ఖాతాలను గుర్తించారు ఈడి అధికారులు. వాటి ద్వారా జరిగిన చెల్లింపులను ఈడి అధికారులు పరిశీలించారు.చికోటి ల్యాప్ టాప్ లో ఉన్న డేటా ను లోతుగా విశ్లేసిస్తున్నారు ఈడి అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news