కూతురు ఏడుస్తుంది అని గొంతు కోసి చంపేసాడు…!

ఘజియాబాద్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు తన నాలుగేళ్ల కుమార్తెను ఏడుపు ఆపడం లేదు అని గొంతుకోసి చంపేసాడు. నోయిడాలో తన భార్యను వెతుకుతూ తన ఆటోరిక్షాలో తన కుమార్తె మృతదేహంతో తిరుగుతున్న వాసుదేవ్ గుప్తాను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుల్తాన్‌ పూర్‌ కు చెందిన గుప్తాను తన భార్య 20 రోజుల క్రితం వదిలేసింది.

crime
crime

వృత్తిరీత్యా ఆటోరిక్షా డ్రైవర్ అయిన గుప్తా తన భార్య, కుమార్తెతో కలిసి ఖోడా కాలనీలోని అద్దె ఇంట్లో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. తన కుమారుడుని తీసుకుని ఆమె ఇంటి నుంచి వెళ్ళింది. ఆమె నాలుగేళ్ల కుమార్తెను గుప్తాతో వదిలి వెళ్ళింది. అయితే తల్లి కోసం చిన్నారి తీవ్రంగా ఎదవడంతో ఆమెను ఆపడానికి ప్రయత్నం చేసినా సరే సాధ్యం కావడంతో గొంతు కోసి చంపేసాడు.