కన్నకూతురుపై అత్యాచారం చేయబోయాడు..!

-

father rape attempt on own daughter in hyderabad

వీడు మనిషి కాదు.. మృగాడు. మానవ మృగం. కళ్లు మూసుకుపోయిన కామాందుడు. అందుకే.. కన్న కూతురు అని కూడా చూడకుండా కాటేయబోయాడు. కూతురుపై అత్యాచారం చేయబోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో చోటు చేసుకున్నది. ఓ వ్యక్తి వృత్తిరిత్యా రౌడీ షీటర్. అతడికి పెళ్లయి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురు వయసు 13 ఏళ్లు. తను ఒంటరిగా ఉన్నప్పుడు తనను లోబరుచుకోవాలనుకున్నాడు. కానీ.. ప్రతిసారి ఆ బాలిక ప్రతిఘటించేది. కొన్ని రోజుల క్రితం మరోసారి అత్యాచారం చేయబోయాడు. ఆ బాలిక భయంతో ఇంట్లో నుంచి పారిపోయింది. తెల్లారి స్కూల్‌కు వెళ్లిన ఆ అమ్మాయి.. స్కూల్‌లో బాధగా ఉండటంతో టీచర్లు ఆరా తీశారు. దీంతో తన తండ్రి చేస్తున్న పాడుపని గురించి టీచర్లకు వెల్లడించింది ఆ చిన్నారి. దీంతో ఈ విషయాన్ని ఆ అమ్మాయి తల్లికి వెల్లడించారు టీచర్లు. వెంటనే తల్లీకూతుళ్లు ఎస్సార్‌నగర్ పోలీస్ట్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news