జనవరి 1 తర్వాత మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవు.. ఎందుకంటే?

-

Why you must change your debit and credit cards by December 31

డిసెంబర్ 31, 2018.. ఇదే చివరి తేది. మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు మార్చుకోవడానికి. లేదంటే జనవరి 1, 2019 నుంచి మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవు. అవును.. సెక్యూరిటీ పర్పస్‌లో పాత మాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న కార్డులను తీసేసి.. కొత్తగా ఈఎంవీ చిప్‌ను కార్డులకు అనుసంధానం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈఎంవీ అంటే యూరోప్లే-మాస్టర్‌కార్డ్-విసా అని అర్థం.

కొత్తగా చిప్‌తో వచ్చే కార్డుల్లో సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రాడ్ జరిగే చాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఆగస్ట్ 27, 2015నే పాత కార్డులను రీప్లేస్ చేయాలంటూ అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. సెప్టెంబర్ 1, 2015 నుంచి కార్డులను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పటికీ కార్డులను మార్చుకోని వారు సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మార్చుకోవచ్చు. లేదంటే.. నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయి.. సర్వీసెస్ సెక్షన్‌లో డెబిట్ కార్డు రిక్వెస్ట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news