మొబైల్ పేలి నలుగురు చిన్నారులు మృతి..!

-

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చెలరేగి మంచానికి అంటుకోవడంతో నలుగురు చిన్నారులు సారిక(12), నిహారిక (08), గోలు (6), కల్లు (5), తీవ్రగాయాలపాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారిని కాపాడేందుకు యత్నించిన వారి తల్లిదండ్రులకు కూడా గాయాలు అయ్యాయి. తండ్రి జానీ(39) పరిస్థితి విషమంగా ఉంది. తల్లి బబిత (35)కి 60 శాతం గాయాలయ్యాయి. ఆమెను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 

మొబైల్ చార్జింగ్ పెట్టి మొబైల్ తో ఓ చిన్నారి ఆడుకుంటుండగా.. మొబైల్ లీడ్, చార్జర్ సమీపంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు మంచం పరుపు వద్దకు చేరాయి. రెప్పపాటులోనే నిప్పు రవ్వలు నిప్పులుగా మారాయి. మంచంపై కూర్చున్న పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. భార్య, పెద్దకుమార్తెతో పాటు పిల్లలను రక్షించేందుకు ప్రయత్నించాడు. ఇందులో ముగ్గురు కాలిపోయారు. నలుగురు చిన్నారులు మరణించగా.. తండ్రి జానీ పరిస్థితి విషమంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news