యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు

నేటి సమాజంలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది. నమ్మిక వారే నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది. క్షణికావేశంలో కొందరు ఈ దురాఘాతానికి పాల్పడుతున్నారు. నిశ్చితార్థం పార్టీకి అని పిలిచి ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ముంబాయిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవినాశ్ పంగీకర్, శిశిర్, తేజస్ అనే ముగ్గురు వ్యక్తులు.. బాధితురాలితో పాటు మరో ఇద్దరు యువతులు స్నేహితులు. పంగీకర్ కు నిశ్చితార్థం జరగడంతో ఈ నెల 8వ తేదీన ముంబయిలోని అంథేరి-కుర్లా రోడ్డులో ఉన్న ఓ హోటల్ లో పార్టీకి ప్లాన్ వేశారు. పంగీకర్ నిశ్చితార్థం పార్టీ ఉందని తప్పకుండా రావాలని ఆ ముగ్గురు యువతులను ఆహ్వానించారు.

హోటల్ లో రూంలో ఈ ఆరుగురు స్నేహితులు పార్టీ చేసుకున్నారు. చీకటి పడుతున్న సమయంలో ఆ ముగ్గురు యువతుల్లో ఇద్దరు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మూడో యువతి కూడా వెళ్లబోతున్న సమయంలో పంగీకర్ అడ్డుకున్నాడు. కొంచెం సేపు తర్వాత వెళ్లు అంటూ బలవంతంగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో జారుకున్న యువతిపై ఆ ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ఇంట్లో దింపేసి వెళ్లిపోయారు.

తనపై అత్యాచారం జరిగిందని ఎవరితో చెప్పుకోలేక బాధితురాలు బాధపడింది. వారం రోజుల తర్వాత శనివారం తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి రిపోర్టులు సేకరించారు. కాగా, అవినాశ్ పంగీకర్, శిశిర్, తేజస్ ముగ్గురు పరారీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు విచారణలో ఉందని.. నిందితులను త్వరలో పట్టుకుని అరెస్ట్ చేస్తామని, బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.