గ్రేటర్ నగారా : డిసెంబర్ 1 ఎన్నికలు, 4న ఫలితాలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కొద్ది సేపటి క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంటుందన్న ఆయన రాష్ట్రంలోని జనాభాలో 1/3 వంతు జనాభా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారని అన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని, తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తామని అన్నారు.

ఇక జిహెచ్ఎంసి పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 1న బల్దియా పోలింగ్ ఉండనుండగా 4న కౌంటింగ్ ఉండనుంది. ఇక నవంబర్ 20న నామినేషన్లకు చివరి రోజు కాగా 21న పరిశీలన జరపనున్నారు. ఇక 22 ఉపసంహరణ జరగనుండగా 3న అవసరమైతే రీపోలింగ్ జరిపే అవకాశం ఉంది.  4న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాల వెల్లడించనున్నారు. నామినేషన్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయని, అవి నింపి ఆ నామినేషన్లు అభ్యర్థులు నేరుగా ఆర్వోకి సమర్పించాలని అన్నారు. అభ్యర్థితో పాటు ముగ్గురు నామినేషన్ రోజు రావొచ్చని అన్నారు.