కామాంధుడి బారి నుంచి బాలికను రక్షించిన దిశ యాప్‌.. కేవ‌లం 10 నిమిషాల్లోనే..

-

మహిళల రక్షణ కోసం జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆపదలో ఉన్న మహిళలకు సాయం అందించేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ యాప్ ద్వారా ఓ కామాంధుడి బారి నుంచి బాలికను రక్షించారు పోలీసులు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలోని గుమ్మఘట్ట మండలం, వీరాపురం తండాలో జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలోని గుమ్మఘట్ట మండలం, వీరాపురం తండాలో జరిగింది. స‌మాచంర ప్ర‌కారం.. తండాలో గిరిజనుల ఆరాధ్య దేవుడు సేవాలాల్ జయంతి వేడుకలు శనివారం నాడు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో గ్రామంలోని ప్రజలంతా పాల్గొన్నారు. అయితే అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో 16 సంవత్సరాల బాలిక, నిద్ర వస్తోందని చెప్పి, పక్క వీధిలో ఉన్న ఇంటికి బయలుదేరింది.

ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన తిరుపాల్ నాయక్ (21) ఆమె వెంట పడి, బలవంతం చేశాడు. కోరిక తీర్చాలని వేధించాడు. గట్టిగా కేకలు వేస్తూ, పరిగెత్తిన ఆమె తక్షణ సాయం కోసం ‘దిశ’కు మెసేజ్ చేసింది. ఈలోగా ఆమె చిన్నాన్న ఇంటివైపు వస్తుండటాన్ని చూసిన తిరుపాల్, అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే సమయంలో తమకు అందిన మెసేజ్ ని చూసిన విజయవాడ కంట్రోల్ రూమ్ నుంచి రాయదుర్గం రూరల్ సీఐకి సమాచారం వెళ్లింది. దీంతో ఘటన జరిగిన ప్రాంతాన్ని సెల్ ఫోన్ సిగ్నల్ సాయంతో ట్రాక్ చేసి, పది నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలిని కలిసి, ఓ ఇంట్లో దాక్కున్న తిరుపాల్ ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news