హథ్రాస్‌: 60 మంది పోలీసులు.. 8 సీసీ కెమెరాలు

-

ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ద‌ళిత యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డిన నిందితుల‌ను కఠినంగా శిక్షించాల‌ని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాల‌ని ప‌లు పార్టీలు, ప్ర‌జా సంఘాల నుంచి కూడా డిమాండ్ పెరిగింది. దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స్పం దించి దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. ఈ నేప‌థ్యంలోనే హథ్రాస్ గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన దళిత యువతి కుటుంబానికి పటిష్టమైన భద్రత కల్పించింది. బాధిత యువతి కుటుంబ స భ్యుల భద్రతను డేగ కళ్లతో పర్యవేక్షించనున్నారు.

బాధితుల ఇంటి వద్ద సీసీ కెమెరాలు, మెటల్‌ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. మహిళా పోలీసులు సహా 60 మందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతను డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని హాథ్రస్‌ ఎస్పీ వినీల్‌ జైస్వాల్‌ తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు పరామర్శించే వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. కాగా.. హత్యాచార ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు స్టేట్‌మెంట్లు మార్చడంతో వారి సమక్షంలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయాలని పోలీసులు నిర్ణయించారు. అయితే భీమ్‌ ఆర్మీ నుంచి రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారన్న వార్తల్లో నిజం లేదని ఈడీ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news