ప్రేమోన్మాది ఘాతుకం… ప్రేమించడం లేదని యువతి గొంతు కోసిన యువకుడు

-

హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించాలని వెంటపడుతూ.. ప్రేమకు అంగీకరించకపోవడంతో కత్తితో యువతిపై దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్న అనూష అనే యువతిని ప్రేమ పేరుతో వేధించాడు అజహర్ అనే వ్యక్తి.  ప్రేమను తిరస్కరించడంతో కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. హన్మకొండలోని పోచమ్మ గుడి దగ్గర ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన అనూషను వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గొంతు కోసిన తర్వాత అనూష కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. హన్మకొండ పోచమ్మకుంట దగ్గర ఓ రూంలో కిరాయికి ఉంటూ అనూష చదువుకుంటోంది. అనూష తల్లిదండ్రులు కూలీ చేసుకుంటూ చదివిస్తున్నారు. దాడికి సమాచారం అందిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news