తన కూతురితో టిక్ టాక్ వీడియో చేసాడని, నగ్నంగా ఊరేగించారు…!

-

ఒక బాలికతో వీడియో చేసినందుకు జైపూర్ యువకుడిని బాలిక తల్లి తండ్రులు చితకబాదారు. నగ్నంగా పరేడ్ చేయించారు. సోషల్ మీడియా సైట్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన వీడియోను బాలిక కుటుంబం చూసింది. వీడియోతో ఆగ్రహించిన అమ్మాయి సోదరుడు మొదట ఆమెను కొట్టాడు, తరువాత ఆమె తండ్రి బాలుడిని పట్టుకుని కొట్టి ఆ తర్వాత పట్టణం చుట్టూ నగ్నంగా పరేడ్ చేయించాడు.

మైనర్ లు అయిన ఆ ఇద్దరూ చేసిన ఆ టిక్‌టాక్ వీడియో, ఇద్దరి మధ్య శృంగార సంబంధాన్ని సూచి౦చే విధంగా ఉంది. అమ్మాయి సోదరుడు అది చూడగానే బాలికపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఆ తర్వాత ఆమెను కొట్టి… ఆమెతో పాటు వీడియో చేసిన బాలుడి మీద పగ తీర్చుకోవాలని భావించి అతనిపై దాడి చేసారు. పట్టణం చుట్టూ నగ్నంగా పరేడ్ చేయించారు. నగ్నంగా పరేడ్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది

ఈ సంఘటన తరువాత, బాలుడి నగ్న వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేసినందుకు బాలిక కుటుంబంపై బాలుడి కుటుంబం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే, బాలిక కుటుంబం పోక్సో మరియు ఎస్సీ / ఎస్టీ చట్టాల ప్రకారం బాలుడిపై కేసు పెట్టింది. దీనితో ఇరు కుటుంబాలపై నాన్ బైలబుల్ కేసులు నమోదు చేసారు పోలీసులు. ప్రస్తుతం రెండు కుటుంబాలు జైల్లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news