శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా బంగారం పట్టివేత

-

హైద‌రాబాద్ లోని శంషాబాద్ విమానాశ్ర‌యం లో అక్ర‌మం గా త‌ర‌లిస్తున్న బంగారాన్ని ఎయిర్ పోర్ట్ క‌స్ట‌మ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. విదేశాల నుంచి అనుమ‌తి లేకుండా హైద‌రాబాద్ కు భారీ గా బంగారాన్ని త‌ర‌లిస్తుండ‌గా క‌స్టమ్స్ అధికారుల కంట ప‌డింది. దీంతో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తి ని అరెస్టు చేసి అక్ర‌మం గా త‌ర‌లిస్తున్న 244.150 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ బ‌హిరంగ మార్కెట్లో దాదాపు రూ. 12.04 ల‌క్ష‌ల విలువ ఉంటుద‌ని క‌స్టమ్స్ అధికారులు అంచ‌నా వేశారు.

కాగ ఈ బంగారాన్ని నిందితుడు దుబాయ్ నుంచి హైద‌రాబాద్ కు త‌ర‌లిస్తుండ‌గా క‌స్ట‌మ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. ఈ బంగారాన్ని నిందితుడు గాజులు గా త‌యారు చేసి అక్ర‌మ మార్గం లో త‌ర‌లించ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఎయిర్ పోర్ట్ క‌స్ట‌మ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. కాగ ఈ మ‌ధ్య కాలం లో విదేశాల నుంచి అక్ర‌మ మార్గం లో హైద‌రాబాద్ కు బంగారాన్ని త‌ర‌లించ‌గా చాలా మంది క‌స్ట‌మ్స్ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news