మ‌రోసారి వాయిదా ప‌డిన నిర్భయ దోషుల ఉరి.. ఏం జ‌రిగిందంటే..?

-

నిర్భయ దోషుల ఉరి శిక్ష పై పాటియాలా కోర్ట్ స్టే విధించింది. వాస్తవానికి రేపు ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉంది. అయితే తమ ఉరిని వాయిదా వెయ్యాలని నిందితులు పిటీషన్ పెట్టుకోగా ఉరి శిక్షను వాయిదా వేస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీనితో పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ లకు ఉరి శిక్ష వాయిదా పడింది. అయితే వాళ్లకు ఉరి ఎప్పుడు అమలు చేస్తారు అనేది తెలియలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉరి వేయొద్దని కోర్ట్ స్పష్టం చేసింది.

ఉరి శిక్ష తేదీ ఎప్పుడు అనేది త్వరలోనే కోర్ట్ చెప్పనుంది. మూడో సారి వారి ఉరి శిక్షపై స్టే విధించారు. ఇప్పటికే వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. దీనితో వాళ్లను ఉరి తీస్తారా లేదా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. ఇప్పటి వరకు తమకు ఉన్న అన్ని అవకాశాలు నలుగురు నిందితులు వరుసగా వినియోగించుకుంటూ ఉరి శిక్షను వాయిదా వేస్తూ వస్తున్నారు. కాగా వారి ఉరి కోసం తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news